దుబాయ్ ఎయిర్‌పోర్టులో 5 నిమిషాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..!!

- September 15, 2026 , by Maagulf
దుబాయ్ ఎయిర్‌పోర్టులో 5 నిమిషాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..!!

దుబాయ్: విదేశీ ప్రయాణాలకు సిద్ధమవుతున్న దుబాయ్ వాసులకు శుభవార్త. ఇకపై దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేవలం 5 నిమిషాల్లోనే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) పొందే అవకాశం కల్పించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-3 అరైవల్స్‌లో ఉన్న కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ లో ఈ సేవ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. చెల్లుబాటయ్యే యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన యూఏఈ పౌరులు, నివాసితులు ఈ సేవను వినియోగించుకోవచ్చు.

అవసరమైన పత్రాలు ఇవే

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం దరఖాస్తుదారులు ఈ పత్రాలను సమర్పించాలి:
- ఎమిరేట్స్ ఐడీ
- చెల్లుబాటయ్యే యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్
- పాస్‌పోర్ట్ కాపీ
- వ్యక్తిగత ఫొటో
ఏడాది పాటు చెల్లుబాటు

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది స్థానిక డ్రైవింగ్ లైసెన్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అనువాద పత్రం. విదేశాల్లోని అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను తమ భాషలో ధృవీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ పర్మిట్ సాధారణంగా జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం చెల్లుబాటవుతుంది. అయితే విదేశాల్లో వాహనం నడిపేటప్పుడు దీనితో పాటు చెల్లుబాటయ్యే యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ కొత్త సేవను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ – దుబాయ్ (GDRFA Dubai), రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA), ఎమిరేట్స్ ఆటోమొబైల్ అండ్ టూరింగ్ క్లబ్, ఆమర్ సంస్థల సహకారంతో ప్రారంభించారు. డిజిటల్ వ్యవస్థల ద్వారా దరఖాస్తుదారుడి వివరాలను వెంటనే ధృవీకరించి, అభ్యర్థనకు తక్షణమే అనుమతి లభించేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో మొత్తం ప్రక్రియను సుమారు ఐదు నిమిషాల్లో పూర్తి చేసి పర్మిట్ జారీ చేయవచ్చని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com