ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!

- September 15, 2026 , by Maagulf
ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!

మస్కట్: ఒమన్‌లో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ డిజిటల్ సేవలు, వ్యవస్థలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని సేవలు సాధారణ సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు రవాణా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MoTCIT) ప్రకటించింది.

ప్రభుత్వ సంస్థలు, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని డిజిటల్ సేవలు, వ్యవస్థల కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం సేవలకు సంబంధించిన ఆపరేషనల్ వాతావరణం స్థిరంగా ఉందని, అన్ని వ్యవస్థలు సాధారణ పనితీరుకు తిరిగి వచ్చాయని అధికారులు వెల్లడించారు.

సాంకేతిక పనుల కారణంగా కొన్ని ప్రభుత్వ సంస్థల్లోని డిజిటల్ సేవలు, వ్యవస్థలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com