టెస్లా కార్లు రీకాల్.. ఎయిర్‌బ్యాగ్‌లో సాంకేతిక లోపం..!!
- September 16, 2026
రియాద్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన కొన్ని మోడల్ 3 కార్లను సౌదీ అరేబియా ప్రభుత్వం రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024 నుంచి 2026 మధ్య తయారైన 182 టెస్లా మోడల్ 3 వాహనాల్లో ఈ సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వాహనంలోని ఫార్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ (FSAB) యాక్టివేషన్‌కు సంబంధించిన కాలిబ్రేషన్‌లో లోపం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కారు పక్కవైపు ఢీకొన్న సమయంలో ఎయిర్‌బ్యాగ్ అనుకున్న విధంగా పనిచేయకపోవచ్చు. ఫలితంగా ప్రయాణికులకు గాయాలయ్యే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.
ఈ రీకాల్‌లో టెస్లా మోడల్ 3 ప్రీమియం LHD వాహనాలు ఉన్నాయి. తమ వాహనం రీకాల్ పరిధిలోకి వస్తుందో లేదో తెలుసుకోవాలనుకునే యజమానులు VIN (వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్)ను ఉపయోగించి సౌదీ అరేబియా అధికారిక రీకాల్ ప్లాట్‌ఫామ్‌లో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
రీకాల్ పరిధిలో ఉన్న వాహనాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిమోట్‌గా ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే టెస్తా గల్ఫ్ లిమిటెడ్ ను 800 850 1047 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- 974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్‌లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్‌లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- ఆర్థిక, ఆర్థిక సహకారం బలోపేతంపై బహ్రెయిన్–సెర్బియా చర్చలు..!!
- టెస్లా కార్లు రీకాల్.. ఎయిర్‌బ్యాగ్‌లో సాంకేతిక లోపం..!!
- సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!
- షార్జాలో విషాదం.. ఇంట్లో కుప్పకూలి 32 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!!
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్







