సౌదీ–ఖతార్‌లో కొత్త చెల్లింపు సదుపాయం..!!

- September 16, 2026 , by Maagulf
సౌదీ–ఖతార్‌లో కొత్త చెల్లింపు సదుపాయం..!!

రియాద్: సౌదీ అరేబియా, ఖతార్ మధ్య ఆర్థిక, చెల్లింపు వ్యవస్థల అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ఇరు దేశాల జాతీయ చెల్లింపు కార్డులైన ‘మదా (mada)’, ‘హిమ్యాన్ (HIMYAN)’ కార్డుల పరస్పర వినియోగాన్ని దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA), ఖతార్ సెంట్రల్ బ్యాంక్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ప్రకారం ఖతార్‌లో సౌదీ ‘మదా’ కార్డులతో, సౌదీ అరేబియాలో ఖతార్ ‘హిమ్యాన్’ కార్డులతో చెల్లింపులు చేసుకునే అవకాశం క్రమంగా అందుబాటులోకి రానుంది.

ఇరు దేశాల జాతీయ చెల్లింపు కార్డుల పరస్పర ఆమోదం ద్వారా సౌదీ, ఖతార్ మధ్య ఆర్థిక సహకారం మరింత పెరగనుంది. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల మధ్య ఉమ్మడి చెల్లింపు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుందని అధికారులు తెలిపారు.

గల్ఫ్ దేశాల మధ్య ఇప్పటికే పనిచేస్తున్న జీసీసీ పేమెంట్ నెట్ వర్క్ (GCC-NET) ద్వారా ఆయా దేశాల పౌరులు, ప్రవాసులు ఇతర GCC దేశాల్లో డెబిట్ కార్డులను ఉపయోగించుకునే సదుపాయం ఉంది. ఈ నెట్‌వర్క్ ద్వారా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకోవడంతో పాటు, POS మెషీన్ల వద్ద చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రయాణించే వారికి చెల్లింపులు మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా GCC దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com