కమల్ హాసన్ క్లాప్‌తో మొదలైన ‘ఎం.ఎస్’ బయోపిక్.. అలరించనున్న రష్మిక!
- September 17, 2026
భారతరత్న, సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ‘ఎం.ఎస్’ (A Legacy On Screen) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ చిత్రాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు చెన్నై వేదికగా వైభవంగా జరిగాయి.
కమల్ హాసన్ చేతుల మీదుగా ముహూర్తపు షాట్
ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నటుడు కమల్ హాసన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వరల్డ్ క్లాస్ మేకింగ్, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీతం మనకు అందించిన సందేశం
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. “తన అద్భుతమైన గాత్రంతో భారతదేశాన్ని, ముఖ్యంగా సౌత్‌ను ఏకం చేసిన ఘనత ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మకే దక్కుతుంది. సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తీసుకొచ్చేవారు. ఆమె ఆలపించిన సుప్రభాతం, లలిత సహస్రనామం వింటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మహాత్మా గాంధీ వంటి మహనీయులు కూడా ఆమెకు అభిమానులే. ఈ తరం మహిళల్లో విశ్వాసాన్ని నింపిన ఐకానిక్ పర్సనాలిటీ ఆమె” అని కొనియాడారు.
రష్మికపై కమల్ సరదా వ్యాఖ్యలు & ప్రముఖుల సమక్షం
చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ రష్మిక పాత్రపై కమల్ హాసన్ సరదాగా స్పందించారు. “సుబ్బులక్ష్మి అమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న రష్మికను చూస్తే అసూయగా ఉంది. ఒకవేళ నేను గడ్డం తీసేసినా ఆమె స్థానంలో నటించి మెప్పించలేను. ఈ గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలకు, దర్శకుడు గౌతమ్‌కు నా బెస్ట్ విషెస్” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి సుహాసిని, శివకుమార్, సముద్రఖని, నిర్మాతలు కలైపులి థాను, కాట్రగడ్డ ప్రసాద్‌తో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్ దంపతులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







