కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- September 18, 2026
కువైట్ : దిగుమతి చేసిన లిక్కర్ ను అక్రమంగా విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రవాస వ్యక్తిని కువైట్ అధికారులు అరెస్ట్ చేశారు. అహ్మదీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ చర్య చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. జాబర్ అల్-అహ్మద్ ప్రాంతంలో అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతను తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇంట్లో 172 మద్యం బాటిళ్లు
విచారణ సందర్భంగా అనుమానితుడు దిగుమతి చేసిన లిక్కర్ ను విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తన నివాసంలో మద్యాన్ని నిల్వ ఉంచిన ప్రదేశాన్ని అధికారులకు చూపించాడు. అతడి నివాసం నుంచి 172 బాటిళ్ల దిగుమతి మద్యం బాటిల్స్ తోపాటు KD 465.750 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు.
అక్రమ మద్యం విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల ద్వారా చట్టబద్ధమైన డబ్బుగా చూపించే ప్రయత్నం చేసినట్లు కూడా అనుమానితుడిపై ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలుదారుల నుంచి డబ్బు స్వీకరించేందుకు పేమెంట్ లింకులను ఉపయోగించి, వచ్చిన మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







