ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!

- September 19, 2026 , by Maagulf
ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!

దోహా: ఖతార్‌లో వచ్చే వారం మరోసారి తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారంలో అర్థరాత్రి తర్వాత నుంచి తెల్లవారుజామున వరకు మిస్ట్, ఫాగ్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నాకు చేరే అవకాశం కూడా ఉందని తెలిపింది.

పొగమంచు కారణంగా రోడ్లపై విజిబిలిటీ తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ప్రయాణించాలని ఖతార్ వాతావరణ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com