ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?

- September 19, 2026 , by Maagulf
ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేలాన్ని డిసెంబర్ 7 నుంచి 13 తేదీల మధ్య నిర్వహించే అవకాశాల పై చర్చ జరుగుతోంది.

మూడు సీజన్ల తర్వాత భారత్‌లోనే వేలం
గత మూడు ఐపీఎల్ సీజన్లకు సంబంధించిన వేలం కార్యక్రమాలు విదేశాల్లో నిర్వహించారు. అయితే IPL 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. వేలం తేదీతో పాటు వేదిక ఎంపికపై కూడా BCCI కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

పెళ్లిళ్ల సీజన్‌తో వేదిక ఎంపికలో సవాల్
డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో హోటళ్లలో గదుల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న హోటల్ వేకెన్సీని పరిశీలించిన తర్వాతే మినీ వేలానికి తుది వేదికను ఖరారు చేయనున్నట్లు IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. వేదిక, తేదీపై అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాత IPL 2027 మినీ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com