రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- September 19, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్, అల్-ఖర్జ్ ప్రాంతాల్లో జారీ చేసిన ముందస్తు ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రకటించింది. ఇంకా పొంచిఉన్న ముప్పు నేపథ్యంలో నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రియాద్, అల్-ఖర్జ్ ప్రాంతాల్లో సివిల్ డిఫెన్స్ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అధికారిక సూచనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
హెచ్చరికలు అమల్లో ఉన్న సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి. కిటికీల అద్దాలు, బాల్కనీలు, పైకప్పులపై నిలబడకూడదు. భవనాల వెలుపల ఉన్నవారు సమీపంలోని భవనంలోకి వెళ్లాలి లేదా బలమైన రక్షణ వెనుక ఆశ్రయం పొందాలి. ప్రజలు గుమిగూడడం, ఘటనలను వీడియో తీయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం ప్రమాదం ముగిసినట్లు ప్రకటించినప్పటికీ, అధికారిక భద్రతా సూచనలను పాటించాలని సౌదీ సివిల్ డిఫెన్స్ పౌరులు, నివాసితులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- మస్కట్‌లో ఈ-బైక్ ల వినియోగానికి ప్రోత్సాహం..!!
- ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్‌లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్‌కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్







