ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- September 19, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖలోని ఉద్యోగ నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ రూల్స్-1993లో ప్రధాన సవరణలు చేపట్టింది.ఇందులో భాగంగా ఆర్టీఓ (RTO), మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) నుంచి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్ల వరకు అన్ని కేడర్లను స్థానిక కేడర్లుగా మారుస్తూ నిర్దిష్టమైన నియామక యూనిట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రవాణా పరిపాలనలో పారదర్శకత, స్థానిక అభ్యర్థులకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
జోన్ల విభజన వివరాలు..ఏ పోస్టుకు ఎన్ని జోన్లు?
నూతన విధానం ప్రకారం (AP Transport Department)ఆర్టీఓ, ఎంవీఐ పోస్టులకు రెండు మల్టీ జోన్లను కేటాయించగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎంవీఐ పోస్టులను ఆరు జోన్ల పరిధిలోకి తీసుకొచ్చారు.
జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి.
జోన్-2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ.
జోన్-3: పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా.
జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.
జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప.
జోన్-6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు ఉన్నాయి.
స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్..అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్:
ఈ సవరణలతో రవాణా శాఖలో చేపటే ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు ఏకంగా 95 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు కొత్త యూనిట్లు ప్రామాణికం కానుండగా.. ప్రమోషన్ పొందేందుకు కనీసం రెండేళ్ల సర్వీసును తప్పనిసరి చేశారు. జూలై 15 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వచ్చినట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ నిబంధనలు స్థానిక నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
తాజా వార్తలు
- మలేషియా: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- GymNation launches AED 1 million Foundation to back local talent, communities and wellness innovation
- నవంబర్ 5న ఖతార్‌లో వర్షం కోసం ప్రార్థనలు..
- మహిళల ప్రీమియర్ లీగ్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
- అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ
- యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ..
- ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్ నౌకలకు మినహాయింపు
- ప్రపంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!







