ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- September 19, 2026
హైదరాబాద్: తెలంగాణలోని విద్యార్థులకు విమానయాన (ఏవియేషన్) రంగంలో అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు, అత్యుత్తమ శిక్షణ కల్పించే లక్ష్యంతో సాంకేతిక విద్యాశాఖ ఒక కీలక అడుగు వేసింది. హైదరాబాద్ పాత ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ‘తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ’ (TGSAA) తో సాంకేతిక విద్యాశాఖ చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.
ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ (JNGP) కళాశాలలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (AME) మూడేళ్ల డిప్లొమా కోర్సు చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యక్ష శిక్షణ లభిస్తుంది. తరగతి గది థియరీతో పాటు ల్యాబ్ ప్రాక్టికల్స్, ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌పై నేరుగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కల్పిస్తారు.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్
డిప్లొమా చివరి ఏడాది విద్యార్థుల కోసం TGSAA లో ఏడాది పాటు దాదాపు 2,100 గంటల సుదీర్ఘ నిడివితో ప్రత్యక్ష ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ పొందే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల విద్యార్థులు విమానాల నిర్వహణలోని సూక్ష్మాంశాలను నేరుగా నేర్చుకునే వీలుంటుంది.
విమానాల నిర్వహణలో ఏవియేషన్ సేఫ్టీ, సెక్యూరిటీ ప్రమాణాలకు ఈ శిక్షణలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలకు అనుగుణంగా సాగుతుంది. ఈ ఎంఓయూ ద్వారా విద్యార్థులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్, ఎంఆర్ఓ (MRO)లు, ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలతో నేరుగా అనుసంధానం ఏర్పడి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఐదేళ్ల కాలపరిమితితో ఒప్పందం
సాంకేతిక విద్యాశాఖ మరియు TGSAA మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం మొత్తం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కోర్సులో 90 శాతం హాజరుతో పాటు ఉత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థులకు అధికారిక ప్రాక్టికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ చొరవ తెలంగాణ యువతకు ఏవియేషన్ రంగంలో నైపుణ్యాలను పెంచి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







