5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!
- November 06, 2026
కువైట్: ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ (FWA) పనితీరులో గల్ఫ్ దేశాలన్నింటినీ వెనక్కి నెట్టి కువైట్ అగ్రస్థానంలో నిలిచింది. డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాలతో పాటు నెట్‌వర్క్ స్పందన సమయాల్లోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. గల్ఫ్ ప్రాంతంలో అత్యంత వేగవంతమైన ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న దేశంగా కువైట్ నిలిచింది. అమెరికాకు చెందిన నెట్‌వర్క్ విశ్లేషణ సంస్థ ఊక్లా (Ookla) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
2026 మే నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన ఇంటర్నెట్ పనితీరు వివరాలను విశ్లేషించిన సంస్థ.. కువైట్‌లోని అధునాతన 5G-Advanced (5G-A) నెట్‌వర్క్‌లు స్థిరమైన లేదా మెరుగైన పనితీరును కనబరిచినట్లు తెలిపింది. కువైట్‌లో ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సగటు డౌన్‌లోడ్ వేగం 321 Mbpsగా నమోదైంది. అదే సమయంలో సాధారణ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వేగం 218 నుంచి 241 Mbps మధ్య ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) వివరాల ప్రకారం, 2026 మధ్య నాటికి కువైట్‌లో 12 లక్షలకు పైగా యాక్టివ్ 5G-A వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్యను 2027 నాటికి 20 లక్షలకు పైగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2029 నాటికి ఇండోర్, అవుట్‌డోర్ ప్రాంతాల్లో 80 శాతం 5G-A నెట్‌వర్క్ కవరేజీ సాధించాలని ప్రణాళిక రూపొందించింది.
దేశంలో 5G-A సేవల పనితీరు మెరుగుపడటానికి మూడు టెలికాం సంస్థలు జైన్ (Zain), ఎస్టీసీ (STC), ఊరెదూ (Ooredoo) తమ నెట్‌వర్క్‌లను విస్తరించడం ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 2025లో అధునాతన సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఈ సంస్థలు 3,000కు పైగా నెట్‌వర్క్ సైట్లను ఏర్పాటు చేశాయి.
తాజా నివేదికతో ఫిక్స్‌డ్ వైర్‌లెస్ కనెక్టివిటీ విషయంలో కువైట్ గల్ఫ్ దేశాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల విస్తరణలో 5G-Advanced సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!
- 2030 నాటికి జీసీసీ రైల్వే నెట్‌వర్క్.. బహ్రెయిన్ సమీక్ష..!!
- ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!
- గ్లోబల్ టెక్ హబ్‌గా దోహా.. రెండోసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026..!!
- యూఏఈ పిల్లల్లో తగ్గుతున్న చేతిరాత నైపుణ్యం..!!
- 122 సాంకేతిక రంగాలకు సౌదీ నాణ్యత పరీక్షల విస్తరణ..!!
- ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్







