ఒమన్‌లో డెంగ్యూ కేసులు తగ్గుముఖం..!!

- September 21, 2026 , by Maagulf
ఒమన్‌లో డెంగ్యూ కేసులు తగ్గుముఖం..!!

మస్కట్‌: దోమల వృద్ధికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, కాలానుగుణ మార్పులు ఉన్నప్పటికీ ఒమన్‌లో డెంగ్యూ జ్వర కేసులు పెరగలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గినట్లు వెల్లడించింది.

డెంగ్యూ జ్వరం అనేది సోకిన దోమ కుట్టడం ద్వారా వ్యాపించే వైరల్‌ వ్యాధి. ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించారు. ముఖ్యంగా ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను తొలగించడం కీలకమని పేర్కొన్నారు.

డెంగ్యూ లక్షణాలు ఇవే..

డెంగ్యూ జ్వరానికి సాధారణంగా కనిపించే లక్షణాల్లో:

* తీవ్రమైన తలనొప్పి

* అధిక జ్వరం

* కండరాలు, కీళ్ల నొప్పులు

* చర్మంపై దద్దుర్లు

* వికారం

* ఆకలి తగ్గడం

వంటి లక్షణాలు ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రమైన కేసుల్లో ఆరోగ్యంపై తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

దోమల వృద్ధిని అడ్డుకోవాలంటే..

డెంగ్యూ వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది:

* నీటి కంటైనర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసి ఖాళీ చేయాలి.

* ఫౌంటైన్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌లోని నీటిని తరచూ మార్చాలి.

* జంతువులు తాగే నీటి పాత్రలను శుభ్రంగా ఉంచాలి.

* నీటి ట్యాంకులను సరిగ్గా మూసి ఉంచాలి.

* ఉపయోగించని పాత టైర్లను తొలగించాలి.

* ఇళ్ల చుట్టూ పేరుకుపోయిన చెత్త, అనవసర వస్తువులను తొలగించాలి.

* ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

* వ్యర్థాలను సక్రమంగా తొలగించాలి.

దోమల వ్యాప్తిని అడ్డుకోవడం, డెంగ్యూ ముప్పును తగ్గించడం సమాజం మొత్తం బాధ్యత అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దోమలు పెరిగే ప్రదేశాలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com