948 మంది కార్మికులకు Dh7.8 మిలియన్ల బకాయిలు రికవరీ..!!
- September 21, 2026
అబుదాబి: ఉద్యోగుల ఆర్థిక హక్కులను పరిరక్షించడంతో పాటు ఉద్యోగ స్థిరత్వాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా.. అబుదాబి లేబర్ కోర్టు మూడు నెలల్లో 948 మంది కార్మికులకు Dh7,811,933 మొత్తంలో బకాయిలను ఇప్పించింది. మూడు కేసుల్లో మొత్తం Dh12.3 మిలియన్ల క్లెయిమ్‌లకు సంబంధించి కోర్టు జోక్యంతో ఈ మొత్తాన్ని రికవరీ చేశారు. న్యాయపరమైన డిపాజిట్లు, ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా కార్మికులకు బకాయిలు అందాయి.
ఈ పరిష్కార ప్రక్రియలో అబుదాబి లేబర్ కోర్టు, యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE)తో పాటు అమలు ప్రక్రియలో భాగమైన సంబంధిత వర్గాలు కలిసి పనిచేశాయి.
457 మందికి పూర్తి బకాయిలు
కుదిరిన సెటిల్మెంట్ల ప్రకారం 457 మంది కార్మికులకు పూర్తి స్థాయిలో వారి బకాయిలు అందాయి. మరో 491 మంది కార్మికులకు పాక్షిక చెల్లింపులు జరిగాయి. మిగిలిన మొత్తాలను క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో కార్మికులకు రావాల్సిన మొత్తం నిరంతరంగా అందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సెటిల్మెంట్ విధానం ద్వారా కార్మికులకు బకాయిలు అందడమే కాకుండా, సంబంధిత కంపెనీల్లోనే తమ ఉద్యోగాలను కొనసాగించుకునే అవకాశం కూడా లభించింది. దీంతో ఉద్యోగ సంబంధాల్లో స్థిరత్వం కొనసాగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు, వ్యాపారాల నిరంతర కొనసాగింపునకు అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
యూఏఈలో 98.6 శాతం వివాదాలు పరిష్కారం
2026 తొలి ఆరు నెలల్లో యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ 98.6 శాతం కార్మిక వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మొత్తం 185,793 కార్మిక వివాదాలు వివాద పరిష్కార వ్యవస్థ ద్వారా పరిష్కరించబడ్డాయి. కేవలం 481 కేసులు, అంటే మొత్తం కేసుల్లో 1.4 శాతం మాత్రమే తదుపరి చర్యల కోసం న్యాయస్థానాలకు వెళ్లాయి.
ఈ స్థాయిలో వివాదాలు వేగంగా పరిష్కారం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. Dh50,000 వరకు క్లెయిమ్‌లతో కూడిన కార్మిక వివాదాలపై నేరుగా తీర్పు ఇచ్చే అధికారాన్ని MoHREకి కల్పించడం అని నిపుణులు తెలిపారు. ఈ విధానం ద్వారా వివాద పరిష్కార ప్రక్రియ వేగవంతమై, స్థానిక కోర్టులపై భారం గణనీయంగా తగ్గడంతో పాటు కార్మికులు తమ చట్టబద్ధమైన బకాయిలను మరింత త్వరగా పొందే అవకాశం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!
- డిసెంబర్ 31 నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి..!!
- ‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!
- ముంబై, మస్కట్ ప్రయాణికులపై అదనపు భారం..!
- సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!
- దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్







