‘ది ప్యారడైజ్’.. 23 రాత్రి నుంచి థియేటర్లలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి: హీరో నాని

- September 22, 2026 , by Maagulf
‘ది ప్యారడైజ్’.. 23 రాత్రి నుంచి థియేటర్లలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి: హీరో నాని

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ: ఈ వేడుకకొచ్చిన అతిథులకి, అభిమానులకి అందరికీ నమస్కారం. ఈ టీంలో అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఎంతో కష్టపడ్డారు. నాతో పాటు కలిసి చేసిన సవారీ గ్యాంగ్ అందరి పెర్ఫార్మెన్స్ మీకు గుర్తుండిపోతుంది. కాసర్ల శ్యామ్ గారు వండర్‌ఫుల్ లిరిక్స్ రాశారు. మా డాన్స్ మాస్టర్‌కి థాంక్యూ. డైరెక్టర్ శ్రీకాంత్‌కి నాకు ఉన్నది అన్నదమ్ముల అనుబంధం. తన విషయంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన అందరూ మన సినిమా అని పని చేశారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. వారి కళ్లల్లో ఆనందం 24న మరింత పెరుగుతుంది. సంపూ క్యారెక్టర్‌ని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంత అద్భుతంగా చేశాడు. అలాగే సోనాలి మేడం గారు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సోనాలి మేడం గారు చేసిన క్యారెక్టర్‌ని ఇంకెవరూ ఊహించలేము. అంత అద్భుతంగా చేశారు. ఆ పాత్ర మీ అందరికీ నచ్చేస్తుంది. రాఘవ్ అమేజింగ్ యాక్టర్.  మోహన్ బాబు గారు ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలుసు. ఆయన ఇంపాక్ట్ అనేది ఈ జనరేషన్‌కి ‘ప్యారడైజ్’ గుర్తు చేస్తుంది. అందులో డౌటే లేదు. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో అర్థమైంది. వెరీ స్వీట్ హార్ట్. ఆయన క్యారెక్టర్‌ని చూసి ఎంజాయ్ చేస్తారు. అనిరుద్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశాడు. సినిమా ఒక సెలబ్రేషన్‌లాగా ఉండబోతుంది. 23 రాత్రి నుంచి ఆ సెలబ్రేషన్ మొదలు కాబోతుంది. థియేటర్లు ఊగిపోతాయి. మీ సెలబ్రేషన్ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను. మనం ఎదుగుతుంటే మన చుట్టూ పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా పెరుగుతుంది. నెగెటివ్‌ని మనం పట్టించుకోకూడదు. పాజిటివ్‌ని పట్టుకొని మనం ముందుకు వెళ్లాలి. మనం గెలవాలని కోరుకున్న వాళ్లు పెరిగినట్టే, మనం ఓడిపోతే చూద్దాం అనుకునే వాళ్లు కూడా పెరుగుతారు. మనం ఓడిపోతే చూడాలనుకునే వారికి ఓడించడానికి నేను ప్రయత్నించడం లేదు. కానీ నేను గెలుస్తాను అని నమ్మే వాళ్లని గెలిపించడానికి నేను కష్టపడుతూనే ఉంటా. మీరు నాకు 100 ఏళ్లకు సరిపడా ప్రేమను ఇచ్చారు. మనల్ని ఎవరూ ఆపలేరు. నా నమ్మకం మీద మీ అందరికీ చాలా నమ్మకం ఉందని నాకు తెలుసు. ఆ నమ్మకంతో చెప్తున్నా.. 23 రాత్రి నుంచి థియేటర్‌లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సినిమా మొదలైనప్పుడే జడలకి మీకు ఒక లాక్ పడుతుంది. అప్పుడు అంటుకునేది వైల్డ్ ఫైర్. శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే తగలబడిపోతుంది. ఇది జడల్ గానీ వాదా. మాకు సపోర్ట్‌గా నిలిచిన తెలంగాణ గవర్నమెంట్‌కి, ఆంధ్ర గవర్నమెంట్‌కి థాంక్యూ సో మచ్. డైరెక్ట్‌గా థియేటర్‌లో కలుసుకుందాం. సెలబ్రేట్ చేసుకుందాం. లవ్ యూ ఆల్.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ: నాని గారి అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సినిమా ఆల్రెడీ విడుదలై బ్లాక్‌బస్టర్ కొట్టినంత ఫీలింగ్ ఈరోజే వస్తోంది. నాని గారు   ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఈరోజు ‘ప్యారడైజ్’తో ఒక స్టార్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక్కడ సందడి చూస్తుంటే ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కంగ్రాజులేషన్స్ టీమ్ అందరికీ. ‘దసరా’తో ఆల్రెడీ ఒక సూపర్ హిట్ చేశారు. ‘ప్యారడైజ్’తో మరో సూపర్ హిట్‌తో వస్తున్నారు.శ్రీకాంత్ కి  తెలంగాణ మీద చాలా పట్టు ఉంది. తన ‘దసరా’ కూడా చాలా అద్భుతమైన సినిమా. ఇప్పుడు ‘ప్యారడైజ్’తో వస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్నో మీ అందరికీ తెలుసు. కోవిడ్ సమయంలో వకీల్ సాబ్  సినిమా ఇబ్బంది పడుతుంటే నేను ఇవ్వాల్సిన 5 కోట్ల రెమ్యునరేషన్ ఆయన తీసుకోలేదు. దట్ ఈజ్ పవర్ స్టార్. ఆయన ఇల్లు దాటి వస్తున్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయి. అలాగే ప్రొడ్యూసర్ సుధాకర్ గురించి ఒక మాట చెప్పాలి. వైజాగ్‌లో ఈ సినిమా గురించి మీరు ఒక రేట్ ఆఫర్ చేస్తే, కొంచెం తగ్గించి ఇవ్వండి అని చెప్పిన నిర్మాత సుధాకర్. పెద్ద  బడ్జెట్‌లో తీస్తూ కూడా అందరి గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి తనకు పెద్ద హిట్ రావాలి. మైత్రీ ‘ఇరుముడి’తో నైజాంలో 50 కోట్లు మార్క్ టచ్ అయింది. సినిమాతో నాని గారు కూడా  నైజాంలో 50 కోట్లు క్రాస్ చేయబోతున్నారు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.

హీరోయిన్ కయాదు లాహోర్ మాట్లాడుతూ: మీ అందరి ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి సినిమా చూడటానికి ఎదురు చూస్తున్నాను. మా నిర్మాతకి థాంక్యూ. చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. మళ్లీ వారి నిర్మాణంలో మరో సినిమా పనిచేయాలని ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఇది నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. అనిరుద్ గారు బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. నాని గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. మీరందరూ నాని గారిని బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరి జోడి కూడా మీ అందరికీ నచ్చుతుంది. 24న జడల్  జమానా మొదలు కాబోతుంది.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మా టీమ్ అందరికీ థాంక్యూ. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మా ‘ప్యారడైజ్’ కూడా ఒక మ్యారేజ్ లాంటిదే. ఈ మ్యారేజ్‌ని సెట్ చేయడానికి అందర్నీ ఒకచోటికి కలపడం జరిగింది. ఇదంతా ఇందాకే సినిమా చూసి వచ్చాను. అందరూ అద్భుతంగా చేశారు. థియేటర్‌లో మీరు చూస్తారు.. బొమ్మ బ్లాక్‌బస్టర్. మా కష్టం మీరు 24న థియేటర్‌లో చూస్తారు. మోహన్ బాబు గారికి, రాఘవ్ గారికి, సోనాలి గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

రాఘవ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. శ్రీకాంత్ గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన ఆయనకి థాంక్యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్యూ. నాని గారితో నటించడం మర్చిపోలేని అనుభూతి. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ కెరీర్ చేంజింగ్ సినిమా. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన తెలుగు సినిమాకి థాంక్యూ. తప్పకుండా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నేను చేసిన పెద్ద సినిమా ఇది. నాని గారి పక్కన చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి నిర్మాతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాని గారితో కలిసి పనిచేయడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. పొట్టుపొట్టు ఆకలి ఉంది. 24న ఆకలి తీరబోతుంది.

సాహు గారపాటి మాట్లాడుతూ: నాని గారు, శ్రీకాంత్, సుధాకర్ గారి కాంబినేషన్‌లో ‘దసరా’ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. దానికి మించిన హిట్ ఈ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. నాని గారు ఎంతోమంది డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్‌ నేను. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించాలి. నాని గారి కెరీర్‌లో ద బెస్ట్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ: ‘యేషా నాగుల కట్ట’ అందరితో పాటు ఈ ఆడిటోరియంలో వినాలని ఇక్కడికి వచ్చాను. ఆ రెండు పాటలు ఈ సినిమాని ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ చేశాయి. ‘గ్యాంగ్ లీడర్’ సమయంలోనే నాని గారి పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాను. ఆయన ప్రతి సినిమాకి ఎదుగుతున్నారు. మా అందరికీ చాలా ఇన్‌స్పిరేషన్. సినిమా బిగ్గెస్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నైజాంలో 50 కోట్లు చేసే సినిమా అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్. ‘ప్యారడైజ్’తో రికార్డులు తిరిగి రాస్తారు. అందులో అనుమానం లేదు.

నవీన్ ఎర్నేని మాట్లాడుతూ: ఇలాంటి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి, హీరోకి చాలా అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇది కచ్చితంగా బ్లాక్‌బస్టర్ సినిమా. నైజాంలో అద్భుతమైన ఓపెనింగ్స్ ఆల్రెడీ వచ్చేశాయి. నాని గారు ఎప్పుడూ మంచి సినిమాలతోనే వస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.

సోనాలి కులకర్ణి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. చాలా ఎమోషనల్‌గా ఉంది. సినిమా విడుదలకు ముందే మీరు ఎంతో ప్రేమని ఇచ్చారు. ఈ సినిమా మేము చాలా జోష్‌తో చేశాం. నాని తెలుగు సినిమాలో ఎంతో ప్రేమని క్రియేట్ చేశారు. అభిమానుల అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 24న మీరు అద్భుతమైన సినిమా చూడబోతున్నారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ: శ్రీకాంత్‌కి నాకు ‘దసరా’ సినిమాతో ఒక అనుబంధం ఏర్పడింది. ‘ప్యారడైజ్’తో అది ఇంకా బలపడింది. శ్రీకాంత్ చాలా అద్భుతమైన ఇంటెన్సిటీతో ‘ప్యారడైజ్’ కథను చెప్పాడు. ఇందులో ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’ పాటలు రాశాను. ఈ సందర్భంగా జానపద కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మదర్-సన్‌కి సంబంధించిన ఎమోషన్ రాసే అవకాశం కూడా దొరికింది. సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాని గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. తను నిజంగా షేర్. సినిమా మీరు ఎంత ఊహించుకున్నా అంతకు రెట్టింపుగా ఈ సినిమా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఊగిపోతాం. సినిమా థియేటర్స్ డ్యాన్స్ ఫ్లోర్‌గా మారిపోతాయి.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ప్యారడైజ్’ దద్దరిల్లిపోతుంది. ఇలాంటి అద్భుతమైన సినిమాలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శ్రీకాంత్  కొత్త ఎమోషన్‌ని అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌లో తీసుకొచ్చారు. మనమందరం ‘అవతార్’ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక ‘అవతార్’ ‘ప్యారడైజ్’ రూపంలో వస్తుంది. మీరందరూ చూడడానికి సిద్ధంగా ఉండండి. నాని గారి ఓపికకి చూసి థాంక్స్ చెప్పాలి. ఆయన ఒక రోజంతా బేర్ బాడీలో యాక్షన్ చేశారు. అది మామూలు విషయం కాదు. సాధారణ మనిషి లీడర్ అయితే ఎలా ఉంటాడో ఈ సినిమాలో చూడబోతున్నారు. నిర్మాత సుధాకర్ గారు భారీ బడ్జెట్‌తో ఈ శ్రమించారు. తప్పకుండా ఈ సినిమా మీకు చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా మాట్లాడుతూ: ఇప్పటివరకు ఇంత రా అండ్ రస్టిక్‌గా తెలుగు సినిమా రాలేదు. మీ అందరికీ నచ్చుతుంది. మా టీమ్‌కి థాంక్యూ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్‌గా పనిచేశారు. 24న మీరు ఒక మెస్మరైజ్ ప్యారడైజ్ వరల్డ్ చూస్తారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com