కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!

- September 22, 2026 , by Maagulf
కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!

కువైట్: కువైట్‌లో బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయంలో పనులు చేయడంపై విధించిన కాలానుగుణ నిషేధం తాజాగా ముగిసింది. అయితే దేశంలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం 45 డిగ్రీలు, బుధవారం, గురువారాల్లో ఏకంగా 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

తీవ్రమైన ఎండల నుంచి బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులను రక్షించేందుకు ప్రతి ఏడాది మధ్యాహ్నం సమయంలో బహిరంగ పనులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తారు. తాజాగా ఆ నిషేధం ముగిసినప్పటికీ, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతుండటంతో కార్మికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com