బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- September 22, 2026
మనామా: బహ్రెయిన్‌లోని ప్రజలకు రిమోట్ వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా హమద్ టౌన్ హెల్త్ సెంటర్‌లో అప్ గ్రేడ్ వీడియో కన్సల్టేషన్ సేవలను ప్రారంభించారు. ఈ సేవలను సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (SCH) చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్ సమక్షంలో ప్రారంభించారు.
టెక్నాలజీతో వైద్య సేవల ఆధునీకరణ
వీడియో కన్సల్టేషన్ సేవలను అభివృద్ధి చేయడం ద్వారా బహ్రెయిన్ ఆరోగ్య వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు, సాంకేతికతను ఉపయోగించి మరింత సమర్థవంతమైన, స్థిరమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డాక్టర్ షేక్ మహమ్మద్ తెలిపారు. డిజిటల్ హెల్త్ సేవల ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని, ఆరోగ్య రంగంలో బహ్రెయిన్ చేపడుతున్న విస్తృత డిజిటల్ మార్పులకు ఇవి తోడ్పడతాయని చెప్పారు.
ఈ వీడియో కన్సల్టేషన్ సేవలు పౌరులు, నివాసితులకు ఆరోగ్య సేవల్లో మరో ముఖ్యమైన సదుపాయంగా మారనున్నాయని ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్ తెలిపారు. ప్రత్యక్షంగా హెల్త్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేని సందర్భాల్లో ఈ సేవలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయని చెప్పారు. రోగులకు నిరంతర వైద్య సేవలు అందించడం, వారి అనుభవాన్ని మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న వైద్య వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడంలో వీడియో కన్సల్టేషన్లు సహాయపడతాయని వివరించారు.
మరిన్ని డిజిటల్ సేవలు
ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లు డిజిటల్ వైద్య సేవలను మరింత అభివృద్ధి చేయనున్నాయి. ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై బహ్రెయిన్ దృష్టి సారించిందని తెలిపారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన







