జపాన్ రాజధాని టోక్యోను భారీ తుఫాను 'మిండుల్లే' వణికిస్తోంది..
- August 22, 2016
జపాన్ రాజధాని టోక్యోను భారీ టైపూన్(తుఫాను) 'మిండుల్లే' వణికిస్తోంది. భారీ ఈదురుగాలులతో తుఫాను సోమవారం టోక్యోను తాకుతుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టోక్యో నుంచి ఉత్తర తొహుకు ప్రాంతం దిశగా మిండుల్లే ప్రభావం చూపుతుందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను సందర్భంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
టోక్యో నగరంపై మిండుల్లే తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇక్కడ వరదలు, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అధికారులు సుమారు 400 విమానాలను రద్దు చేశారు.ముఖ్యంగా టోక్యోలోని హనెడ విమానాశ్రయంకు రాకపోకలు నిలిచిపోయాయి. 145 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు జపాన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ సైతం 90 విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో..సుమారు 48 వేల మంది విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతున్నట్లు వెల్లడించారు
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







