నిర్మాతే విష్ణుకు విలన్ గా !
- August 22, 2016
ఆడోరకం ఈడోరకం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు, హీరోగా తెరకెక్కుతున్న సినిమా లక్కున్నోడు. గీతాంజలి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్ వివి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ నిర్మాతే విష్ణుకు విలన్ గా మారుతున్నాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్ వివి సత్యనారాయణ ప్రస్తుతం ప్రభుదేవ, తమన్నాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అభినేత్రి సినిమా తెలుగు వర్షన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.అదే సమయంలో మంచు విష్ణు హీరోగా లక్కున్నోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తన రెండో సినిమా శంకరాభరణంలో గెస్ట్ రోల్ లో నటించిన సత్యనారాయణ ఇప్పుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో మెయిన్ విలన్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం







