స్టోర్ పాలెస్ ప్రారంభించిన మోదీ ...
- August 22, 2016
పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్‌కు భారతీయుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు అఫ్గాన్ రాజధాని కాబుల్‌లో పునరుద్ధరించిన స్టోర్ పాలెస్‌ను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కాబుల్‌లో ఉన్న అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలిసి మోదీ ఈ పాలెస్ ప్రారంభోత్సవం చేశారు. అఫ్గానిస్థాన్‌తో మంచి స్నేహం ఉందని, ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. బయటి శక్తుల కారణంగా అఫ్గాన్‌లో కొనసాగుతున్న హింస బాధపెడుతోందని మోదీ అన్నారు. దేశంలో శాంతి భధ్రతలు, అభివృద్ధి పెంపొందడంతో పాటు సంపన్న దేశంగా మారాలని, అఫ్గాన్ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.శాంతి ఉగ్రవాదాన్ని, హింసను జయిస్తుందని.. భారత్, అఫ్గాన్ ఎప్పటికీ మంచి మిత్రులుగా ఉండాలని అఫ్గాన్ అధ్యక్షుడు ఘని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







