ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి

- September 23, 2026 , by Maagulf
ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని డర్బన్ టౌన్‌షిప్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి సాయుధులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో గర్భిణితో సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.

ఒకే గదిలోకి తీసుకెళ్లి కాల్పులు

మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు క్వాజులు-నటాల్ ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సాయుధులు ఇంట్లో ఉన్న బాధితులను ఒక గదిలోకి తీసుకెళ్లి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో గర్భిణి సహా 11 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సామూహిక కాల్పులకు దారితీసిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దాడి వెనుక వ్యక్తిగత విభేదాలా, నేర కార్యకలాపాలకు సంబంధించిన కారణాలా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన పై పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల గుర్తింపు తదితర అంశాలపై పోలీసులు మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com