ముత్రా కేబుల్ కార్‌ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!

- September 23, 2026 , by Maagulf
ముత్రా కేబుల్ కార్‌ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!

మస్కట్: ఒమన్‌లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ప్రారంభం కానున్న ముత్రా టెలిఫెరిక్‌ (కేబుల్ కార్‌) భద్రతా ఏర్పాట్లను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) అధికారులు పరిశీలించారు. జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సహకారంతో మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ యూనిట్ అధికారులు ముత్రా కేబుల్ కార్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. కేబుల్ కార్‌ ప్రారంభానికి ముందు ఆపరేషనల్ రెడీనెస్‌ను పెంచడం, భద్రతా వ్యవస్థల సామర్థ్యాన్ని పరిశీలించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని CDAA తెలిపింది.

అంతర్జాతీయ ప్రమాణాలపై పరిశీలన

తనిఖీలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్‌ ప్రోటోకాల్స్‌, సాంకేతిక భద్రతా వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సిబ్బంది సన్నద్ధతను అధికారులు సమీక్షించారు. అలాగే కేబుల్ కార్‌లో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు.

సందర్శకులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం

ముత్రా కేబుల్ కార్‌ ప్రారంభానికి ముందు చేపడుతున్న ఆపరేషనల్‌ సన్నాహాల్లో ఈ తనిఖీ కీలక భాగమని అధికారులు తెలిపారు. పర్యాటక ఆకర్షణగా ప్రారంభం కానున్న ఈ కేబుల్ కార్‌లో ప్రయాణించే సందర్శకులతో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది భద్రతను నిర్ధారించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com