ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- September 23, 2026
మస్కట్: ఒమన్‌లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ప్రారంభం కానున్న ముత్రా టెలిఫెరిక్ (కేబుల్ కార్) భద్రతా ఏర్పాట్లను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) అధికారులు పరిశీలించారు. జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సహకారంతో మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ యూనిట్ అధికారులు ముత్రా కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ను సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. కేబుల్ కార్ ప్రారంభానికి ముందు ఆపరేషనల్ రెడీనెస్‌ను పెంచడం, భద్రతా వ్యవస్థల సామర్థ్యాన్ని పరిశీలించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని CDAA తెలిపింది.
అంతర్జాతీయ ప్రమాణాలపై పరిశీలన
తనిఖీలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్రోటోకాల్స్, సాంకేతిక భద్రతా వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సిబ్బంది సన్నద్ధతను అధికారులు సమీక్షించారు. అలాగే కేబుల్ కార్లో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు.
సందర్శకులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం
ముత్రా కేబుల్ కార్ ప్రారంభానికి ముందు చేపడుతున్న ఆపరేషనల్ సన్నాహాల్లో ఈ తనిఖీ కీలక భాగమని అధికారులు తెలిపారు. పర్యాటక ఆకర్షణగా ప్రారంభం కానున్న ఈ కేబుల్ కార్లో ప్రయాణించే సందర్శకులతో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది భద్రతను నిర్ధారించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







