సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!

- September 23, 2026 , by Maagulf
సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!

జెడ్డా: సౌదీ అరేబియా 96వ జాతీయ దినోత్సవం సందర్భంగా జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి సౌదీ రాజు, క్రౌన్ ప్రిన్స్‌తో పాటు సౌదీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌదీ జాతీయ దినోత్సవం ఆ దేశ గొప్ప వారసత్వం, అద్భుతమైన విజయాలు, అభివృద్ధి మరియు పరివర్తన దిశగా కొనసాగుతున్న ప్రయాణాన్ని జరుపుకునే సందర్భంగా పేర్కొన్నారు.

భారత్‌, సౌదీ అరేబియా మధ్య చారిత్రక స్నేహబంధంతో పాటు భవిష్యత్‌ దిశగా కొనసాగుతున్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.

సౌదీ అరేబియా మరింత అభివృద్ధి చెందాలని, భారత్‌-సౌదీ అరేబియా మధ్య స్నేహబంధాలు భవిష్యత్తులో మరింత బలపడాలని భారత కాన్సుల్ జనరల్ ఆకాంక్షించారు. సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా సౌదీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com