భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- September 23, 2026
దోహా: భారత రాయబారి డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆసియా వ్యవహారాల డైరెక్టర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు విస్తృతంగా అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత్, ఖతార్ మధ్య కొనసాగుతున్న సన్నిహిత, బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. పరస్పర ప్రయోజనం ఉన్న వివిధ అంశాలపైనా ఇరువురు అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు.
భారత్–ఖతార్ మధ్య ఇప్పటికే ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







