ఎగవేతదారుడికి బంపర్ ఆఫర్
- August 22, 2016
ఆసియాకి చెందిన ఓ వ్యాపారవేత్తని ఇంటర్‌పోల్ 'మోస్ట్ వాంటెడ్'గా గుర్తించింది. అయితే దుబాయ్ పోలీసుల నుంచి ఆయనకు అద్భుతమైన అవకాశం లభించింది. యూఏఈలో ఆయన గతంలో చెల్లించాల్సిన చెల్లింపుల్ని క్లియర్ చేసేందుకు అవకాశం కల్పించారు. 2009లో న్యాయస్థానం, ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయన కంపెనీ 200,000 దిర్హామ్‌ల మొత్తం బ్యాంకులకు చెల్లించవలసి ఉంది. రెసిషన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది ఆ సంస్థ. అయితే స్వదేశానికి పారిపోయిన ఆ వ్యక్తి కుటుంబం, తమకు అవకాశం కల్పిస్తే ఆ లోన్లు అన్నీ క్లియర్ చేస్తామని దుబాయ్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన దుబాయ్ పోలీసులు, దుబాయ్‌కి ఆయన వచ్చేందుకు అనుమతిచ్చారు. అలాగే, సదరు వ్యాపారవేత్త తమ కంపెనీని నష్టాల్లో ముంచేసిన మేనేజర్‌పై పోలీసులకు పిర్యాదు చేయాలనుకుంటున్నట్లు దుబాయ్ పోలీస్ వాంటెడ్ సెక్షన్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ అయిల్ చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









