ఎలుకలతో నిండిన ఫార్మసీ మూసివేత
- August 22, 2016
సోషల్ మీడియాలో ఓ ఫార్మసీ వ్యవహారం వెలుగు చూసింది. ఫార్మసీలో అపరిశుభ్రత ఆవరించిందనీ, ఎలుకలు యధేచ్ఛగా తిరుగుతున్నాయనీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అధికారులు ఈ ఫార్మసీపై దాడులు జరిపి, క్లోజ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ వ్యవహారంపై స్పందించిన నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ), సోషల్ మీడియాలో వచ్చిందంతా వాస్తవమేనని ప్రకటించింది. ఎన్‌హెచ్‌ఆర్‌ఎ మడిసిన్స్ క్వాలిటీ ఎస్యూరెన్స్ కన్సల్టెంట్ హెషమ్ అల్ అవామి మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌హెచ్‌ఎ సిఇఓ డాక్టర్ మరియమ్ అల్ జలాహా, అధికారులను ఆ ఫార్మసీలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఆ ఫార్మసీ పేరుని వెల్లడించలేదు. విచారణ సందర్భంగా పరుగులు, ఎలుకలు వంటివి ఫార్మసీలోని ఆహార పదార్థాల వద్ద కనిపించాయి. దాంతో పార్మసీని క్లోజ్ చేసి, సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేశారు. పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రభుత్వం తీసుకోబడే చర్యలకు లోబడి వ్యవహరిస్తే ఫార్మసీ ప్రారంభానికి అనుమతులిచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !







