సరికొత్త సాంకేతిక హంగులతో స్కూల్ బస్సులు
- August 22, 2016
ఆర్‌టిఎకి చెందిన దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) 2016-17 సంవత్సరానికిగాను విద్యార్థుల కోసం సరికొత్త సాంకేతిక హంగులతో కూడిన స్కూల్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సుల్లో విద్యార్థుల భద్రత కోసం అనేక ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని డిటిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో లింక్ అప్ చేశారు. దాంతో బస్సులో ఏం జరుగుతోందో కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేయడానికి వీలుంటుంది. అలాగే బస్సుల్ని జిపిఎస్‌తో అనుసంధానం చేశారు. తద్వారా డిటిసి కంట్రోల్ సెంటర్‌కే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే స్కూల్ యాజమాన్యాలకీ బస్సుల వివరాలు తెలుస్తాయి. బస్సు సర్వీసులు అవసరమైన స్కూల్స్, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. స్కూలు బస్సుల ప్రమాదాల్ని నివారించేందుకే ఈ కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని బస్సుల్లో వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







