మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- September 24, 2026
తెలంగాణలోని వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పేర్ల ఖరారుపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ప్రజాభిప్రాయాలు, వివిధ వర్గాల సూచనలను విస్తృతంగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ రెండు విమానాశ్రయాలకు ప్రముఖ చారిత్రక, పోరాట యోధుల పేర్లను ఖరారు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమదేవి, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కొమురం భీం పేర్లను నామకరణం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
కేబినెట్ ఆమోదం, కేంద్రానికి ప్రతిపాదనలు
ఈ పేర్ల ఖరారుకు సంబంధించిన ఫైలును త్వరలోనే నిర్వహించబోయే రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశంలో ప్రతిపాదించనున్నారు. కేబినెట్ అధికారిక ఆమోదం పొందిన వెంటనే, ఇదే పేర్లను ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అధికారిక లేఖ రాయనుంది. కేంద్రం నుండి అనుమతి లభించిన అనంతరం రెండు విమానాశ్రయాల పేర్లతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు ‘అల్లూరి సీతారామరాజు’, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేర్లు పెట్టిన విధానాన్ని ఈ సందర్భంగా సమీక్షలో చర్చించారు. తెలంగాణకు వచ్చే విదేశీ ప్రతినిధులకు, పర్యాటకులకు రాష్ట్ర గొప్ప చరిత్ర, మహనీయుల పోరాట పటిమ తెలియజెప్పేలా ఈ పేర్లు ఎంతో ఉపకరిస్తాయని భావించారు. మామునూరు ఎయిర్‌పోర్టు కోసం ‘సమ్మక్క-సారలమ్మ’ పేర్లను కూడా పరిశీలించినప్పటికీ, తుది చర్చల అనంతరం ‘రాణి రుద్రమ’ పేరు వైపే మొగ్గు చూపారు.
అద్భుతమైన డిజైన్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు
మరోవైపు ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల డిజైన్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానాశ్రయాల ఆకృతులు సాధారణంగా కాకుండా, తెలంగాణ సంస్కృతి, చరిత్ర ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను సీఎం గట్టిగా ఆదేశించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు
- షూటింగ్లో ఆరో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!







