మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం

- September 24, 2026 , by Maagulf
మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం

పోర్ట్ లూయిస్: ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, ట్రిపుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల గ్రహీత డా.గజల్ శ్రీనివాస్‌కు మారిషస్‌లో ప్రతిష్టాత్మక ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం లభించింది.

108 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొలువై ఉన్న హరి హర దేవస్థానం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మారిషస్ దేశాధ్యక్షులుధరమ్ బీర్ గోకుల్ డా.గజల్ శ్రీనివాస్‌ను ఈ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

డా.గజల్ శ్రీ నివాస్ వివిధ ప్రపంచ భాషల్లో గానం చేస్తూ సనాతన ధర్మం, అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని ధరమ్ బీర్ గోకుల్ కొనియాడారు.

హరి హర దేవస్థానం తరఫున అందజేసిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి డా. గజల్ శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. మారిషస్‌లో ప్రపంచ శాంతి, భారతీయ సంస్కృతిపై డా.గజల్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ప్రశంసించారు.

సంగీతాన్ని శాంతి, సాంస్కృతిక ఐక్యతకు వారధిగా ఉపయోగిస్తూ డా.గజల్ శ్రీనివాస్ చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది. మారిషస్ గడ్డ పై లభించిన ఈ గౌరవం భారతీయ సంగీతం, సంస్కృతి, శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com