బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- September 25, 2026
మనామా: బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లు, డైవింగ్ పరికరాల విక్రయ దుకాణాల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో సంయుక్త తనిఖీలు నిర్వహించారు. పలు ప్రభుత్వ విభాగాల సహకారంతో ఈ తనిఖీలు చేపట్టారు.
డైవింగ్ కేంద్రాలు భద్రత, రక్షణ నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలించారు. డైవింగ్ పరికరాలు, కేంద్రాల్లోని సౌకర్యాల పరిస్థితితో పాటు ఇన్స్ట్రక్టర్లు, సిబ్బందికి అవసరమైన అర్హతలు, శిక్షణ ఉన్నాయా అనే విషయాలను తనిఖీ చేశారు.
డైవింగ్ సిలిండర్లలో నింపే గాలి నాణ్యతకు సంబంధించిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. అలాగే ఇన్స్ట్రక్టర్లు, ఉద్యోగులకు సంబంధించిన శిక్షణ, గుర్తింపు (అక్రెడిటేషన్) సర్టిఫికెట్లను కూడా తనిఖీ చేశారు. అదేవిధంగా డైవింగ్ కేంద్రాల వాణిజ్య రిజిస్ట్రేషన్ల చెల్లుబాటు, అనుమతించిన కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు.
డైవింగ్ పరికరాలు, ఎయిర్ సిలిండర్లను తనిఖీ చేయడంతో పాటు వాటికి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న పరీక్షలు, మెయింటెనెన్స్‌కు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఆక్సిజన్ పరికరాలు, ప్రథమ చికిత్స సామగ్రి, ఎమర్జెన్సీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయా అనే విషయాలను కూడా అధికారులు నిర్ధారించారు.
ఈ సంయుక్త తనిఖీ కార్యక్రమంలో కోస్ట్ గార్డ్, ముహర్రక్ మరియు క్యాపిటల్ గవర్నరేట్ల పోలీస్ డైరెక్టరేట్లు, నేషనాలిటీ, పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ అఫైర్స్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







