2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- September 25, 2026
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. 2027 సంవత్సరానికి ప్రపంచంలోని 50 ఉత్తమ పర్యాటక గమ్యస్థానాలతో రూపొందించిన వార్షిక జాబితాలో ఒమన్‌కు చోటు దక్కింది. సింగపూర్‌కు చెందిన వరల్డ్ ట్రావెల్ మ్యాగజిన్ (World Travel Magazine) విడుదల చేసిన ఈ జాబితాలో మధ్యప్రాచ్య విభాగంలో “Best for Arab Hospitality” అనే కేటగిరీలో ఒమన్‌ను ఎంపిక చేశారు.
ఒమన్‌లోని వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక ప్రత్యేకతలు, పర్యాటక అనుభవాలను మ్యాగజైన్ ప్రశంసించింది. ముఖ్యంగా విస్తారమైన ఎడారులు, ఎత్తైన పర్వతాలు, సుదీర్ఘ తీర ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించే ప్రధాన అంశాలుగా పేర్కొంది. అదే సమయంలో ఒమన్ ప్రజల ఆతిథ్యాన్ని కూడా మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. సందర్శకులకు ఒమన్ ప్రజలు అందించే ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం, శ్రద్ధ అక్కడి ప్రయాణ అనుభవంలో ముఖ్యమైన భాగమని పేర్కొంది.
ప్రతి ఏడాది విడుదలయ్యే “Best in Travel” జాబితాలో తదుపరి సంవత్సరంలో ప్రయాణికులు సందర్శించేందుకు పరిగణించదగిన పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







