నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- September 25, 2026
న్యూయార్క్: కువైట్ అమీర్ ప్రతినిధి, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ ఖాలెద్ అల్-హమద్ అల్-సబాహ్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, ఐర్లాండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్ తో వేర్వేరుగా సమావేశమయ్యారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో కువైట్ శాశ్వత మిషన్‌లో ఈ భేటీలు జరిగాయి. 81వ ఐరాస జనరల్ అసెంబ్లీ ఉన్నతస్థాయి సమావేశాల సందర్భంగా ఈ చర్చలు నిర్వహించారు.
మార్క్ రుట్టేతో జరిగిన సమావేశంలో ఇస్తాంబుల్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ (ICI) కింద కువైట్–నాటో మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యం, సహకారంపై చర్చించారు. అలాగే కువైట్‌లోని నాటో రీజినల్ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ, సాంకేతిక సహకార కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరువురు చర్చించారు.
ఐర్లాండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్‌తో భేటీ
ఐర్లాండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్ తో జరిగిన సమావేశంలో కువైట్–ఐర్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మార్గాలపై చర్చించినట్లు కువైట్ అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు







