రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి..

- August 23, 2016 , by Maagulf
రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి..

పొరుగుదేశం పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్‌ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. శనివారం ఈ కేసు విచారణకు రానుంది.ఇటీవల పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్‌ కార్యక్రమానికి రమ్య హాజరయ్యారు. తిరిగి భారత్‌కు చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'కొందరు అన్నట్లుగా పాకిస్థాన్‌ నరకమేమీ కాదు. అక్కడి ప్రజలంతా మనలాంటివారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు' అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.పాకిస్థాన్‌ను పొగిడేలా మాట్లాడారంటూ ఆమెపై కొందరు విమర్శలు చేశారు.కన్నడంతో పాటు పలు భాషల్లో నటించిన రమ్య.. 2011లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇటీవల పాక్‌, భారత్‌ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌.. ఆ దేశాన్ని నరకంతో పోల్చిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్‌ దేశాల సమావేశానికి హాజరైన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా పాక్‌ వైఖరిని ఖండించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com