కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- September 26, 2026
కువైట్ : కువైట్ లో ఆహార భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆహార సంస్థలపై కువైట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN), అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి అహ్మదీ, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్లలోఈ తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలు గుర్తించడంతో 152 కిలోలకు పైగా ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు.
అహ్మదీలో తీవ్ర ఉల్లంఘనలు
అహ్మదీలో నిర్వహించిన తనిఖీల్లో లైసెన్స్ లేకుండా ఆహార సంస్థను నిర్వహించడం, కల్తీ ఆహారాన్ని విక్రయించడం, సాంకేతిక, ఆరోగ్య ప్రమాణాలను పాటించకపోవడం, వ్యక్తిగత మరియు ప్రజా పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు.
ముబారక్ అల్-కబీర్‌లో 26 సంస్థల్లో తనిఖీలు
ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్‌లో అధికారులు 26 ఆహార సంస్థలను తనిఖీ చేశారు. ఆరోగ్య, పరిశుభ్రత నిబంధనలు, లైసెన్సులు, ఆరోగ్య ధ్రువపత్రాలకు సంబంధించిన ఉల్లంఘనలపై 8 కేసులు నమోదు చేశారు. అలాగే మానవ వినియోగానికి అనర్హంగా ఉన్న 2.457 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
ఆహార భద్రతను నిర్ధారించడం, పౌరులు, నివాసితుల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తనిఖీలు, పర్యవేక్షణ చర్యలను కొనసాగిస్తామని PAFN వెల్లడించింది. ఆహార సంస్థలు లైసెన్సులు, ఆరోగ్య నిబంధనలు, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







