కేసీఆర్ ముంబై బయల్దేరి వెళ్లారు....
- August 23, 2016
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో తుది ఒప్పందం విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ముంబై బయల్దేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు తుది ఒప్పందం చేసుకోనుంది. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట' ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో ముంబైలో సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేయనున్నారు.కాగా, మహా ఒప్పందాన్ని స్వాగతిస్తూ జూలపల్లి నుంచి మేడిగడ్డ వరకు టీఆర్ఎస్ యూత్ నేత రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో 1500 బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఈ మహా ఒప్పందాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో నల్ల జెండాలతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







