మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!

- September 27, 2026 , by Maagulf
మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!

మక్కా: ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మక్కా నగరంలో కొత్తగా అభివృద్ధి చేసిన పలు రోడ్డు లేన్లపై వాహన రాకపోకలను ప్రారంభించారు. మక్కా సిటీ అండ్ హోలీ సైట్స్ రాయల్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. థర్డ్ రింగ్ రోడ్, ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ రోడ్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన లేన్లను వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మార్గాల వినియోగంతో ప్రయాణ సమయం 90 శాతానికి పైగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

థర్డ్ రింగ్ రోడ్‌లో అదనంగా 1.5 కిలోమీటర్ల రహదారి అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రిన్స్ మెటాబ్ ఇంటర్‌సెక్షన్‌ను ప్రిన్స్ సుల్తాన్ ఇంటర్‌సెక్షన్ మీదుగా గ్రాండ్ మస్జిద్ ఇంటర్‌సెక్షన్‌తో కలుపుతుంది. అలాగే ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ రోడ్‌లో చివరి దశ రహదారి పనులు పూర్తయ్యాయి. ఈ మార్గం ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ యాక్సిస్‌ను ప్రిన్స్ నాయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్‌సెక్షన్ మీదుగా అబ్దుల్‌కాదిర్ కోషక్ స్ట్రీట్‌తో అనుసంధానిస్తుంది.

హజ్, ఉమ్రా యాత్రికులకు ప్రయోజనం

ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, స్థానికులు, సందర్శకులు, హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు సులభమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా ఈ సమగ్ర మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హజ్, ఉమ్రా సీజన్లలో మక్కాకు భారీగా వచ్చే యాత్రికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఈ కొత్త రోడ్డు మార్గాలు ఉపయోగపడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com