తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- September 29, 2026
తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
టీటీడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, అక్టోబర్ 1 (గురువారం) మరియు అక్టోబర్ 5 (సోమవారం) తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి. అయితే, రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకుమాత్రం ఈ నిబంధన నుంచి ప్రత్యేక మినహాయింపు ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. మిగిలిన సాధారణ వీఐపీ సిఫార్సు లేఖలకు ఈ రోజుల్లో అనుమతి ఉండదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!
- తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!
- ఖతార్‌లో ఆన్లైన్ బ్లాక్‌మెయిల్‌పై కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస ఉద్యోగులకు కొత్త వెసులుబాటు..!!
- యాస్మిన్ పాస్ వద్ద మూడు ట్రక్కులు ఢీ..!!
- దుబాయ్‌లో 22 మంది బెగ్గర్స్ ముఠా అరెస్ట్..!!
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’







