సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- September 29, 2026
జాజాన్:సౌదీ అరేబియాలోని దక్షిణ జాజాన్ ప్రాంతంలో ఆరుగురు ఇథియోపియా పౌరులను అక్రమంగా తరలిస్తున్న ఓ యెమెన్ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ముజాహిదీన్‌కు చెందిన పెట్రోల్ బృందాలు ఈ చర్య చేపట్టాయి. సౌదీ అరేబియా సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇథియోపియా పౌరులను తరలిస్తున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టైన ఆరుగురు ఇథియోపియా పౌరులను సంబంధిత అధికారులకు అప్పగించగా, వారిని అక్రమంగా తరలించిన యెమెన్ వ్యక్తిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.
15 ఏళ్ల వరకు జైలు.. SR1 మిలియన్ జరిమానా
సౌదీ అధికారులు హెచ్చరించిన ప్రకారం.. సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి దేశంలోకి ప్రవేశించిన వ్యక్తులకు సహాయం చేయడం, వారిని దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం, ఆశ్రయం కల్పించడం లేదా ఏ రూపంలోనైనా సహాయం, సేవలు అందించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.ఇలాంటి నేరాలకు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, నేరానికి ఉపయోగించిన వాహనం, ఆశ్రయం కల్పించేందుకు ఉపయోగించిన ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు బహిరంగంగా అవమానించే శిక్షలు కూడా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సరిహద్దు భద్రతా ఉల్లంఘనలకు సహకరించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..
- విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్!!
- రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలిటెంట్ల దాడి..
- పేదరికం పై భారత్ విజయం: ప్రధాని మోదీ
- దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!







