యాస్మిన్ పాస్ వద్ద మూడు ట్రక్కులు ఢీ..!!

- September 29, 2026 , by Maagulf
యాస్మిన్ పాస్ వద్ద మూడు ట్రక్కులు ఢీ..!!

సలాలా: ఒమన్‌లోని సలాలా గవర్నరేట్‌కు వెళ్లే రహదారిపై యాస్మిన్ పాస్ వద్ద మూడు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం నేపథ్యంలో రహదారి వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది జారీ చేసే సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు, నష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com