ఖతార్‌లో ఆన్లైన్ బ్లాక్‌మెయిల్‌పై కఠిన చర్యలు..!!
- September 29, 2026
దోహా: ఆన్లైన్ బ్లాక్మెయిల్, సైబర్ ఎక్స్‌టార్షన్‌కు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. నేరం రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా QR100,000 వరకు జరిమానా లేదా రెండింటిలో ఏదో ఒకటి విధించే అవకాశం ఉందని తెలిపింది. ‘సైబర్ క్రైమ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్’ పేరుతో నిర్వహించిన అవగాహన వెబినార్‌లో MoI అధికారులు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్థిక, ఎలక్ట్రానిక్ నేరాల నిరోధక విభాగానికి చెందిన ఫస్ట్ లెఫ్టినెంట్ ఇంజినీర్ అద్నాన్ హసన్ అల్ రషీద్ మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంటర్నెట్ను అక్రమంగా ఉపయోగించి చేసే నేరాల్లో బ్లాక్మెయిల్ కూడా ఒకటని తెలిపారు.
ఖతార్ సైబర్‌క్రైమ్ నిరోధక చట్టం నం.14/2014లోని ఆర్టికల్ 6 ప్రకారం.. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక వ్యక్తిని బెదిరించడం లేదా బ్లాక్మెయిల్ చేసి ఏదైనా చేయించడం లేదా చేయకుండా అడ్డుకోవడం నేరంగా పరిగణిస్తారు. దీనికి మూడేళ్ల వరకు జైలు లేదా QR100,000 వరకు జరిమానా లేదా రెండింటిలో ఏదో ఒకటి విధించవచ్చు. బ్లాక్‌మెయిల్‌కు గురైన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అల్ రషీద్ సూచించారు. ఫిర్యాదులో ఆలస్యం జరిగితే డిజిటల్ ఆధారాలు తొలగించబడే లేదా మార్చబడే అవకాశం ఉన్నందున, సకాలంలో సమాచారం అందించడం దర్యాప్తులో కీలకమని చెప్పారు.
సైబర్ నేరాల నుంచి రక్షణకు సూచనలు
- బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి, వాటిని క్రమం తప్పకుండా మార్చాలి.
- పేర్లు, పుట్టిన తేదీలు వంటి సులభంగా ఊహించగల సమాచారాన్ని పాస్‌వర్డ్‌లుగా ఉపయోగించకూడదు.
- టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA), టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేయాలి.
- మొబైల్ యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
- ముఖ్యమైన డేటాకు బ్యాకప్‌లు ఉంచుకోవాలి.
- అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు.
- నమ్మకం లేని వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే సందేశాలు, ఫైళ్లను తెరవకూడదు.
- ఈమెయిల్ ఖాతాలకు రికవరీ ఫోన్ నంబర్, బ్యాకప్ ఈమెయిల్‌ను జోడించాలి.
మీ పేరుతో ఉన్న మొబైల్ నంబర్లపై జాగ్రత్త
తమ పేరుపై ఎన్ని మొబైల్ నంబర్లు నమోదై ఉన్నాయో పరిశీలించాలని MoI సూచించింది. తమకు తెలియని నంబర్లు ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలని తెలిపింది. లేదంటే నేరగాళ్లు వాటిని మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇతరుల అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో వారి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంపైనా అధికారులు హెచ్చరించారు. వ్యక్తిగత గోప్యతకు ఖతార్ చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయని, ఇతరుల చిత్రాలను దుర్వినియోగం చేయడం లేదా అనుమతి లేకుండా ప్రచురించడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని తెలిపారు.
వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ మోసాలు
వృద్ధులు కూడా సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నారని అల్ రషీద్ తెలిపారు. పిల్లలు లేదా బంధువులుగా నటిస్తూ అత్యవసరంగా డబ్బు కావాలంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హ్యాకింగ్, ఆన్లైన్ మోసాలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్, పిల్లలపై లైంగిక దోపిడీ, పుకార్ల వ్యాప్తి వంటి అనేక రకాల సైబర్ నేరాలపై వెబినార్‌లో అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!
- తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!
- ఖతార్‌లో ఆన్లైన్ బ్లాక్‌మెయిల్‌పై కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస ఉద్యోగులకు కొత్త వెసులుబాటు..!!
- యాస్మిన్ పాస్ వద్ద మూడు ట్రక్కులు ఢీ..!!
- దుబాయ్‌లో 22 మంది బెగ్గర్స్ ముఠా అరెస్ట్..!!
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’







