కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!

- September 29, 2026 , by Maagulf
కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!

కువైట్ : ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాల చెల్లింపులను మరింత వేగంగా, పారదర్శకంగా, సురక్షితంగా చేసేందుకు కువైట్ సెంట్రల్ బ్యాంక్ (CBK) కొత్త వ్యవస్థను ప్రారంభించింది. కువైట్ వేజ్ ప్రొటెక్షన్ అండ్ పేమెంట్ సిస్టమ్ (KWPS) పేరుతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానిక బ్యాంకుల ద్వారా ఉద్యోగుల జీతాల బదిలీలను ప్రాసెస్ చేసేందుకు KWPS ఒక కేంద్రీకృత వేదికగా పనిచేయనుంది.

కొత్త వ్యవస్థ ద్వారా అధికారులు జీతాల చెల్లింపులను పర్యవేక్షించగలరు. జీతాలు ఆలస్యం కావడం లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే వాటిని ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రైవేట్ రంగ ఉద్యోగుల వేతన హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం
KWPS ద్వారా దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత విస్తరించడంతో పాటు, ఆర్థిక సేవలకు అందుబాటు (Financial Inclusion) పెరుగుతుందని అంచనా. అలాగే కార్మిక మార్కెట్‌ను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు ఈ వ్యవస్థ సహాయపడనుంది. కువైట్ నేషనల్ పేమెంట్స్ సిస్టమ్ ప్రాజెక్ట్ రెండో దశలో ప్రారంభించిన మూడో వ్యవస్థxe KWPS ఉందని నిపుణులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో కువైట్ ఆటోమెటేడ్ క్లియరింగ్ సిస్టమ్ (KACH) ప్రారంభం కాగా, ఫిబ్రవరి లో కువైట్ ఆక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (KDMS) ను ప్రారంభించారు. కొత్త KWPS ద్వారా ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో పాటు, జీతాల ఆలస్యం వంటి సమస్యలను అధికారులు మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com