దిబ్బా అల్‌ ఫుజారియాలో స్వల్ప ప్రకంపనలు

- August 23, 2016 , by Maagulf
దిబ్బా అల్‌ ఫుజారియాలో స్వల్ప ప్రకంపనలు

దిబ్బా అల్‌ ఫుజారియాలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతో స్థానికులు కొంత ఆందోళన చెందారు. అయితే ప్రకంపనల తీవ్రత పెద్దదేమీ కాదని, రిక్టర్‌ స్కేల్‌పై 2.6 తీవ్రతగా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ అండ్‌ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్‌), ఉదయం 7.23 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయనీ, ప్రకంపనల కేంద్రం దిబ్బా అల్‌ ఫుజారియా ప్రాంతంలో 7 కిలోమీటర్ల లోతున ఉందని వెల్లడించింది. స్థానికుల నుంచి భూ ప్రకంపనలపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎన్‌సిఎంఎస్‌ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com