పోలీస్ వేషంలో వచ్చి, మహిళపై అత్యాచారం
- August 23, 2016
పోలీస్ వేషంలో వచ్చి, ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. సోమవారం కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. పాకిస్తాన్‌కి చెందిన 31 ఏళ్ళ వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ అపరిచితుడు, అల్ రిక్కా రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న మహిళను ఆపి, జ్యుయెలరీ దుకాణంలో జరిగిన దొంగతనంపై విచారణ జరుపుతున్న పోలీస్ అధికారిగా పరిచయం చేసుకుని, ఆమెను కిడ్నాప్ చేశాడు. ఈ వివరాల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి బాధితురాలు వివరించారు. తనను కిడ్నాప్ చేసిన అనంతరం, జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. తన బ్యాగ్‌లో 4,000, 5,000 దిర్హామ్‌ల విలువైన రెండు మొబైల్ ఫోన్లను మరికు కొంత నగదును దుండగుడు దోచుకున్నట్లు బాధితురాలు తెలిపింది. ఆ తరువాత తనను మెయిన్ రోడ్ మీదకు తీసుకువచ్చి వదిలేశాడని ఆమె వెల్లడించింది. బాధితురాలు మొరాకోకి చెందిన మహిళ
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







