వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్, CPR కార్యక్రమం
- September 29, 2026
హైదరాబాద్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్, CPR కార్యక్రమాన్ని నిర్వహించింది.గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటు లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం,CPR పై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ జీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ, డైరెక్టర్ డాక్టర్ ఏ.ఆర్. కృష్ణ ప్రసాద్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంపత్ కుమార్, ఇండియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ హారికా ద్రోణవల్లి, TCS హైదరాబాద్ రీజినల్ హెడ్ – HR శ్రీకాంత్ సురంపూడి, MCAలో రిజిస్టర్ అయిన డైరెక్టర్ రణబీర్ సింగ్ బగ్గ* తదితరులు ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా *డాక్టర్ అనిల్ కృష్ణ జీ* మాట్లాడుతూ, “గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎవరికైనా రావచ్చు. గుండెపోటు ప్రమాద కారకాలు, ముందస్తు హెచ్చరిక లక్షణాలపై అవగాహనతో పాటు CPRపై ప్రాథమిక జ్ఞానం ఉంటే అత్యవసర సమయంలో కీలకమైన నిమిషాల్లో సరైన విధంగా స్పందించగలుగుతారు. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా ప్రజలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం” అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ మాట్లాడుతూ, “సమాజంలో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు ఎలా సహాయం చేయాలో కూడా తెలుసుకోవాలి” అని అన్నారు.
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, “గుండె సంబంధిత సమస్యల్లో లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, వైద్య సహాయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణంగా చెమటలు పట్టడం, అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం, చేతి, భుజం, వెన్ను లేదా దవడ వైపు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారం, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు” అని తెలిపారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొన్న ఇండియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ హారికా ద్రోణవల్లి మాట్లాడుతూ, “చెస్ మనకు ఏకాగ్రతతో ఉండటం, ఒత్తిడిని ఎదుర్కోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం నేర్పుతుంది. ఆరోగ్యానికి కూడా అదే విధమైన శ్రద్ధ, క్రమశిక్షణ అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, ఒత్తిడిని నియంత్రించుకోవడం ఎంతో ముఖ్యం. ప్రజలు గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
డాక్టర్ ఏ.ఆర్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, “గుండె అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో కీలకం. ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధికంగా చెమటలు పట్టడం, తల తిరగడం, చేతి, భుజం లేదా దవడ వైపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్య సహాయం అందించడంతో పాటు CPR, AEDను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ద్వారా అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన వ్యక్తికి ప్రాణాపాయ సమయంలో సహాయం అందించవచ్చు. గుండె ఆరోగ్యానికి అవగాహన, నివారణ చర్యలు, సకాలంలో స్పందించడం ఎంతో అవసరం” అని తెలిపారు.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక హార్ట్ హెల్త్ కూపన్‌ను కూడా విడుదల చేసింది. ప్రజలు తమ గుండె ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ వహించేలా ప్రోత్సహించేందుకు ఈ కూపన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో కూపన్‌ను విడుదల చేశారు. కేవలం అవగాహన కల్పించడానికే పరిమితం కాకుండా, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని మెడికవర్ హాస్పిటల్స్ తెలిపింది.
కార్యక్రమంలో ‘నో యువర్ హార్ట్’ ద్వారా గుండె ఆరోగ్య ప్రమాదాలను తెలుసుకోవడం,‘రీడ్ ద సిగ్నల్స్’ ద్వారా గుండెపోటు హెచ్చరిక లక్షణాలపై అవగాహన,‘సేవ్ ఎ హార్ట్’ ద్వారా CPR, AEDపై అవగాహన, ‘రిసెట్ యువర్ హార్ట్’ ద్వారా ఒత్తిడి, నిద్ర, పోషకాహారం, శారీరక చలనం వంటి అంశాలపై సమాచారం, ‘టేక్ హార్ట్ యాక్షన్’* ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.
గుండె ఆరోగ్యం అంటే కేవలం వ్యాధికి చికిత్స తీసుకోవడం మాత్రమే కాదని, వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్చరిక లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర సమయంలో సరైన విధంగా స్పందించడం కూడా అంతే ముఖ్యమని ఈ కార్యక్రమం ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ సందేశాన్ని ఇచ్చింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







