ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- September 29, 2026
ఆసియా గేమ్స్–2026లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. పలు విభాగాల్లో పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో భారత షూటింగ్ క్రీడలో చారిత్రాత్మక అధ్యాయం నమోదైంది. హర్యానాకు చెందిన 26 ఏళ్ల షూటర్ నీరూదండా మహిళల వ్యక్తిగత ట్రాప్ షూటింగ్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విభాగంలో ఆసియా క్రీడల వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు.
మహిళల ట్రాప్ వ్యక్తిగత ఫైనల్లో నీరూదండా 28 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. దీంతో గతంలో ఉన్న 24 పాయింట్ల ఆసియా రికార్డును ఆమె అధిగమించారు. ఫైనల్లో మొత్తం ఎనిమిది మంది షూటర్లు పోటీ పడగా.. నీరూ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. క్వాలిఫికేషన్‌లోనూ నీరూదండా సత్తా చాటారు. 118 హిట్స్‌తో టాప్ స్కోర్ సాధించి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఆమెతో పాటు భారత షూటర్లు ఆశిమా అహ్లావత్, మనీషా కీర్ కూడా పోటీలో నిలిచారు. అయితే, వారు వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
వ్యక్తిగత స్వర్ణానికి ముందు నీరూదండా, ఆశిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించారు. భారత బృందం మొత్తం 328 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చైనా 346 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా, కువైట్ 325 పాయింట్లతో కాంస్యం సాధించింది.
ప్రస్తుతం భారత్ ఐదు బంగారు, 21 రజత, 21 కాంస్య మొత్తం 47 పతకాలతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. ఈ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఫైనల్లో హర్మన్ ప్రీత్ సేన తొలి స్వర్ణాన్ని దక్కించుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో సురుచి సింగ్, కమల్ జీత్ జంట పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక కబడ్డీలో మహిళల, పురుషుల టీమ్ లు పసిడి సాధించారు. అయితే, ఇవన్నీ టీమ్ ఈవెంట్స్ లో కాగా.. తాజాగా.. నీరుదండా మహిళల ట్రాప్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!
- తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!
- ఖతార్‌లో ఆన్లైన్ బ్లాక్‌మెయిల్‌పై కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస ఉద్యోగులకు కొత్త వెసులుబాటు..!!







