బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!

- September 29, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!

మనామా: శరీరంలో హెరాయిన్‌తో కూడిన 22 క్యాప్సూల్స్ దాచుకుని బహ్రెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆసియా దేశస్థుడికి కోర్టు జీవిత ఖైదు, BD10,000 జరిమానా విధించింది.

కేసు వివరాల ప్రకారం.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ కోసం పనిచేసేందుకు నిందితుడు అంగీకరించాడు. తన స్వస్థలానికి చెందిన ఓ వ్యక్తి సూచన మేరకు క్యాప్సూల్స్‌ను మింగి బహ్రెయిన్‌కు తీసుకెళ్లి మరో వ్యక్తికి అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా విదేశీ కరెన్సీలో డబ్బు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పాటు విమాన టికెట్లు, వసతి ఖర్చులను కూడా ఏర్పాటు చేశారు.

బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత నిందితుడిని రెడ్ ఛానల్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో తాను మాదకద్రవ్యాల క్యాప్సూల్స్‌ను మింగినట్లు అతడు అంగీకరించాడు.

వైద్య పరీక్షలు, చికిత్సా ప్రక్రియల సమయంలో అతడి శరీరం నుంచి హెరాయిన్‌తో నిండిన 22 క్యాప్సూల్స్ బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అతడి వద్ద నుంచి BD275 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

జీవిత ఖైదు.. శాశ్వత బహిష్కరణ

చట్టపరమైన అనుమతి లేకుండా హెరాయిన్‌ను బహ్రెయిన్‌లోకి దిగుమతి చేసుకోవడం, అక్రమ విక్రయ ఉద్దేశంతో కలిగి ఉండటం వంటి అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమోదు చేసింది. అనంతరం కేసును హై క్రిమినల్ కోర్టుకు అప్పగించారు.

కేసును విచారించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదు, BD10,000 జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం అతడిని శాశ్వతంగా బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై నిందితుడు హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించినప్పటికీ, అప్పీల్ కోర్టు దిగువ కోర్టు తీర్పును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com