ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- September 30, 2026
దోహా: గన్ కలిగి ఉండేందుకు లేదా తీసుకెళ్లేందుకు లైసెన్స్ పొందిన ఖతార్ పౌరులు వాటిని ఇతరులకు అప్పుగా ఇవ్వడం, అప్పగించడం లేదా వారి వద్ద ఉండేందుకు అనుమతించకూడదని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది.
గన్ లైసెన్స్ పూర్తిగా వ్యక్తిగతమైనదని, అది లైసెన్స్ పొందిన వ్యక్తికి మాత్రమే చట్టబద్ధంగా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్ లేని వ్యక్తికి తుపాకీని ఇవ్వడం, అప్పుగా ఇవ్వడం లేదా అతని వద్ద ఉండేందుకు అనుమతించడం 1999 నాటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాల చట్టం నంబర్ (14)కు స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తుపాకీ లైసెన్స్‌దారుతో పాటు లైసెన్స్ లేని వ్యక్తి కూడా క్రిమినల్ బాధ్యతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
అంతేకాకుండా, గన్ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఆయుధాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. లైసెన్స్‌దారుడు భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి తుపాకీ లైసెన్స్ పొందకుండా నిషేధం విధించవచ్చని MoI తెలిపింది.
సమాజ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు ఈ విషయంలో చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడబోమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







