కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..

- September 30, 2026 , by Maagulf
కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..

కువైట్: జంతువులను వీధుల్లో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో వదిలిపెట్టవద్దని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) జంతువుల యజమానులను హెచ్చరించింది. జంతువుల పెంపకం, సంరక్షణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

జంతువులను ఇకపై సంరక్షించలేని పరిస్థితిలో ఉన్న యజమానులు వాటిని వీధుల్లో లేదా ఇతర బహిరంగ ప్రాంతాల్లో వదిలేయకూడదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసి, సంబంధిత అధికారుల సమన్వయంతో జంతువులను స్వీకరించేందుకు లేదా తగిన చర్యలు తీసుకునేందుకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

విచ్చలవిడి జంతువుల కారణంగా తలెత్తే పరిస్థితులను నియంత్రించడం, ప్రజల భద్రతను మెరుగుపరచడంలో భాగంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడి కుక్కలు కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని, దగ్గరకు వెళ్లవద్దని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com