సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- September 30, 2026
తెలంగాణ: ఆనాడు ఇచ్చిన మాట ప్రకారమే గత పాలకుల గడీలను బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి సిరిసిల్ల గడీలను కూడా పూర్తిగా నేలమట్టం చేస్తామని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే పదవులు అనుభవించారని, కానీ తాము మాత్రం తెలంగాణ కోసం నిజంగా పోరాడిన వారికే సముచిత ప్రాధాన్యం కల్పించామని ఆయన పేర్కొన్నారు.
నేతన్నల ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలపై కేటీఆర్‌కు సీఎం రేవంత్ ప్రశ్నలు
2009 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‌ను గెలిపిస్తే, ఇక్కడి నేతన్నల ఆత్మహత్యలను ఆయన ఎందుకు నివారించలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. బుధవారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన కేటీఆర్‌ను తీవ్రంగా ప్రశ్నించారు. ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల కష్టాలను కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినా బాధిత కుటుంబాలకు కనీసం అణాపైసా సాయం కూడా చేయలేదని సీఎం మండిపడ్డారు.
తాజా వార్తలు
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు







